జైపూర్, ఫిబ్రవరి 16: ఆర్థిక సంవత్సర లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని సింగరేణి డైరెక్టర్ పీపీ వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం శ్రీరాంపూర్ ఇన్చార్జి జీం శ్రీనివాస్‌తో కలిసి డివిజన్లోని ఇందారం ఓపెన్కాస్టుగనిని సందర్శించారు. 2024-25 లక్ష్యసాధనకు ఈ 45 రోజులు కీలకమైనవని గుర్తుచేశారు. అధికారులతో కలిసి ఓపెన్‌కాస్టు గనిలోని పనిస్థలాల వద్ద బెంచ్‌లను, ఆఫ్ లోడింగ్ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఓసీలో మట్టి నిర్వహణ పనులు చేపడుతున్న వరహా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ఉత్పత్తికి అనుగుణంగా ఓబీ తీయాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి ఉత్పాదకత సాధించడంలో ముందుండాలని తెలిపారు. ఆయన వెంట గని ప్రాజెక్టు అధికారి ఏవీ రెడ్డి, మేనేజర్లు రవికుమార్, నాగన్న, రక్షణ అధికారి సతీశ్ పాల్గొన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
మందమర్రి, ఫిబ్రవరి 16 : సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) నాయకులు సింగరేణి డైరెక్టర్(పీపీ) కొప్పుల వెంకటేశ్వర్లును కోరారు. సింగరేణి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లను ఆదివారం గోదావరిఖనిలోని డైరెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించారు. సంస్థ నిర్దేశిత లక్ష్యాల సాధనలో నాయకులు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, కేంద్ర కమిటీ నాయకులు సీహెచ్ వెంకటరమణ, దాసరి శ్రీనివాస్, రాజనాల రమేశ్, కే.లక్ష్మణ్, కూడాల తిరుపతి, కొట్టె రమేశ్, రవికిరణ్, పెద్దపల్లి రాజయ్య పాల్గొన్నారు.