శ్రీరాంపూర్, మార్చి 2 : సింగరేణి సంస్థ 2025-26 వార్షిక సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. 2024-25లో 700 లక్షల టన్నులు నిర్ణయించగా, ఈసారి 11 ఏరియాల్లో 720 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో 22 భూగర్భ గనులకు 71 లక్షల టన్నులు, 20 ఓసీపీలకు 649 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.