జైపూర్, అక్టోబర్ 28: శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఓపెన్‌కాస్టు గనిని ఆదివారం రాత్రి సింగరేణి సీఎండీ బలరాంనాయక్ సందర్శించారు. డైరెక్టర్ పీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏరియా జీఎం సంజీవరెడ్డి, మార్కెటింగ్ జీఎం రవిప్రసాద్‌తో కలిసి గనిలో పని స్థలాలను పరిశీలించారు. గనిపై లైటింగ్, పని స్థలాల్లో తీసుకుంటున్న రక్షణ చర్యలను పరిశీలించారు. అధికారులు, ఓబీ కాంట్రాక్టర్‌తో మాట్లాడారు.
నిర్ధేశిత లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. ఓబీ ఎంత తీస్తే అంత బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని లక్ష్యాలకు అణుగుణంగా పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం సత్యనారాయణ, ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, గని మేనేజర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.