కుంటాల : నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలోని విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాజశేఖర్, రంజిత్, రాకేష్ ల వడ్రంగి వర్క్ షాపులు ఇటీవల షార్ట్ సర్క్యూట్తో ( Short Circuit ) దగ్ధమయ్యాయి. ఆ దుకాణంలో ఉన్న పనిముట్లు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. గ్రామస్థుల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్( Chairman ) భోస్లే మోహన్ రావ్ ( Mohan Rao Patel ) పటేల్ బుధవారం ఓలా గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
కాలిపోయిన దుకాణాలను పరిశీలించారు. బాధలో ఉన్న కుటుంబీకులను ఓదార్చారు. ధైర్యం కోల్పోవద్దని కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. దగ్ధమైన మూడు దుకాణాలను మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో వారం రోజుల్లో నిర్మించి ఇస్తానని మోహన్ రావ్ పటేల్ హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు లక్ష్మణ్ పటేల్, గుద్దేటి నర్సయ్య, ముధోల్ మాజీ ఎంపీపీ సుబాష్ పటేల్, రవి, రఘువీర్, ట్రస్ట్ టీం సభ్యులు పాల్గొన్నారు.