జన్నారం, డిసెంబర్ 6 : మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందని సందెవేణి రాజంకు చెందిన గొర్రెల మందపై శుక్రవారం తెల్లవారు జామున తోడేళ్లు దాడి చేశాయి. దొడ్డిలోకి చొరబడ్డ తోడేళ్లు 11 గొర్రెలను హతమార్చాయి.
తనకు జీవనాధారమైన గొర్రెలు మృతి చెందాయని, రూ. లక్ష వరకు నష్టపోయానని, అటవీ అధికారులు పరిహారం అందించి ఆదుకోవాలని రాజం వేడుకుంటున్నాడు.