బేల, అక్టోబర్ 10 : ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం రాత్రి తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు దోమల బెడద, మరోవైపు ఉక్కపోతతో రోగులు, బాలింతలు, నవజాత శిశువులు, చిన్నారులు అవస్థలు పడ్డారు.
సెల్ ఫోన్ వెలుతురులో రోగులకు వైద్య సిబ్బంది మందులు అందించారు. దవాఖానలో కనీసం మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంపై అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై రోగులు మండిపడ్డారు.