వరుస చోరీల ముఠా అరెస్ట్
భైంసా మండలంతో పాటు దిలావర్పూర్, నర్సాపూర్, లోకేశ్వరం మండలాల్లోని ఆలయాలు, ఇండ్లు, బెల్టు షాపుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠాను శనివారం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.
భైంసాటౌన్, ఆగస్టు 22 : భైంసా మండలంతో పాటు దిలావర్పూర్, నర్సాపూర్, లోకేశ్వరం మండలాల్లోని ఆలయాలు, ఇండ్లు, బెల్టు షాపుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠాను శనివారం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం మాటేగాం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు ముఠాగా ఏర్పడి లోకేశ్వరం మండలంలోని రాయాపూర్‌కాండ్లీ, మన్మథ్, దిలావర్పూర్, నర్సాపూర్, భైంసా మండలంలోని పెండ్పెల్లి, తిమ్మాపూర్, హంపోలి, పుస్పూర్, దేగాం గ్రామాల్లో తాళం వేసి ఉన్న 11 ఇండ్లు , 8 ఆలయాలు 1 బెల్ట్ షాపులో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు.
వీరి నుంచి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లు, రూ. 5 వేల నగదును సీజ్ చేశారు. నిందితులు అరిసెల పెద్ద సాయన్న(ఎడ్బిడ్ , ముథోల్ మండలం) తంగోళ్ల భూమేశ్(బ్రహ్మణ్‌గాం , ముథోల్ మండలం) బుడుబుడుకల గంగన్న(ఎడ్బిడ్, ముథోల్ మండలం) బైరుపుల పండరి(కంఠం, నందిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా) బైరుపుల కుమార్(కంఠం, నందిపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా)ను అరెస్ట్ చేశారు. దొంగలించిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఇతర వస్తువులను రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టారని, వీటి రీకవరికి చర్యలు చేపపడుతున్నామని ఏఎస్పీ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ సుప్రియ ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

