ఉట్నూర్ రూరల్, జూలై 17: గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కుమ్మరి కుంట గ్రామాన్ని కమిషన్ సభ్యులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ టైగర్ జోన్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కావాల్సిన చర్యలు చేపడుతామని తెలిపారు. అంతకు ముందు కొలాం సంఘం నాయకులు మాట్లాడుతూ అడవిలో జీవించే హక్కు తమకు భార త రాజ్యాంగం కల్పించిందన్నారు.
ఉన్న ఇం డ్లు తీసేసి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటుంటే అడుగడుగునా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు. ఈ విషయంపై అ క్కడే ఉన్న ఫారెస్ట్ అధికారులను చైర్మన్ వివరాలు అడిగారు. తాము ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ తరుణం లో కోలాం సంఘ నాయకులు ఆవేశానికి గురికాగా చైర్మన్ సముదాయించారు. అనంతరం ఈ సమస్యలపై ఫైల్ తయారు చేసి అందించాలని పీవోను చైర్మన్ కోరారు.
ఇతర రాష్ర్టాల్లో ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకొని అసలు సమస్య పరిష్కారానికి మార్గాన్ని తెలుసుకొని పరిష్కరిస్తామని పీవో పేర్కొన్నారు. కమిషన్ సభ్యులు నీలాదేవి, రాంబాబు, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, ఆర్డీవో మోహన్ సింగ్, తహసీల్దార్ రఘునాథ్‌రావు, ఏపీవో జనరల్ వసంత్‌రావు, పీవీటీసీ భాస్కర్, ఎఫ్‌డీవో అరవిం ద్, డీఏసీ డీవో సునీత, ఎంపీడీవో మొహమ్మ ద్ రాయిస్ ఉల్లా, ఈశ్వరీబాయి, ఈఈ తానా జీ, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.