కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ నీలా రాంచందర్ ( Neela Ramchander ) తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల స్థానిక సర్పంచ్ ( Sarpanch ) ఎన్నికల్లో ఆమె కాసిపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు.
రెండు పదవులు ఉండకూడదనే నిబంధన మేరకు సహకార సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు.ఈ సందర్బంగా సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ పదవి కాలం సహకరించిన సభ్యులకు, అధికారులకు నీలా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాసిపేట సర్పంచ్‌కు ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, డీసీసీబీ డైరెక్టర్ దుర్గం లక్ష్మీకి శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో సహకార వైస్ చైర్మన్ తాటిపాముల శంకర్ గౌడ్, సోగాల సాగర్, జంజిరాల విష్ణు మూర్తి, చెల్ల రమేష్, చుంచు మల్లేష్, సహకార బ్యాంక్ సూపర్ వైజర్ ప్రదీప్, సీఈవో రాజశేఖర్, భూక్య రాంచందర్, మాజీ కోఆప్షన్ సిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.