హాజీపూర్, ఆగస్టు 7 : స్వచ్ఛదనం-పచ్చద నం కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించి, సీజనల్ వ్యా ధుల నివారణకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం హాజీపూర్ మండలంలోని నర్సింగాపూర్లో రాజేశ్వర్రావ్ పల్లెలో ఎంపీవో యాదయ్యతో కలిసి పర్యటించారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించా రు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. పిల్లలకు మెనూ ప్రకారం సకాలంలో పోషకాహా రం అందించాలని, ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ చూపాలని సూచించారు.
గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం పడ్తన్పల్లి ఆదర్శ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులు బోధనా తీరును తరగతి గదిలో కూర్చోని పరిశీలించారు. అనంతరం పీహెచ్సీని తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. గుడిపేటలోని నర్సరీని సందర్శించి వన మహాత్సవానికి మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో మధుసూదన్, ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, ఏపీవో మల్ల య్య, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.