బెల్లంపల్లి, ఫిబ్రవరి 14 : బెల్లంపల్లి పట్టణంలోని రెండోవార్డు ఇందిరమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రానికి స్థలం కేటాయించాలని బీ ఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు సబ్బని అరుణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీవో హరికృష్ణకు బస్తీవాసులతో కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో ఇందిరమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రానికి స్థలం కేటాయించగా, కొందరు ఆక్రమించుకున్నారని పే ర్కొన్నారు.
బస్తీ ప్రజల ఆందోళనతో ఆ స్థలం లో అక్రమ నిర్మాణాన్ని తహసీల్దార్ కూల్చివేశారని గుర్తు చేశారు. ఆ స్థలంలో అంగన్వాడీ కేంద్రాన్ని మంజూరు చేసి, పకా భవనం నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు జూపాక భాగ్యలక్ష్మి, మద్దుల జమున, కృష్ణపల్లి కళావతి, ఎండీ అజీమా బేగం, ఆరెల్లి మల్లయ్య, రంగం మహేశ్, సంబోధి సురేశ్ పాల్గొన్నారు.