మంచిర్యాలటౌన్, మార్చి 17: ఏప్రిల్ 6న భద్రాచలం ఆలయంలో నిర్వహించే సీతారామ కల్యాణానికి సంబంధించిన ముత్యాలతో కూడిన తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేసే సేవల బుకింగ్‌ను సోమవారం మంచిర్యాల డిపో మేనేజర్ ఎస్ జనార్దన్ ప్రారంభించారు. ముందుగా ఆయన తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ సీతారాముల కల్యాణ వేడుకలను నేరుగా వెళ్లలేని వారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఏప్రిల్ 6వ తేదీలోగా మంచిర్యాల, పరిసర ప్రాంతాల ప్రజలు తమ పేరు, ఇంటి చిరునామాను తెలియజేస్తే రూ. 151 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు లాజిస్టిక్ ఇన్చార్జి ఫోన్ నంబర్ 7382841860, డీఎంటీలు 9866771482, 9154298541 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ దేవపాల, అకౌంట్స్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, కార్గో సిబ్బంది పాల్గొన్నారు.