ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా విహార యాత్రలకు ( Excursions ) కల్పిస్తున్న బస్ సౌకర్యాలను ( RTC buses ) సద్వినియోగ చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ కె.వి రాజశేఖర్( DM Rajashekar ) తెలిపారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో బాలాజీ భీమ్ విహారయాత్రను ఈనెల 27న ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు.
ఆసిఫాబాద్ నుండి ఉదయం 8 గంటలకు ప్రారంభమై 9 గంటలకు రెబ్బెన మండలంలోని గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శనం, వాగులో పుణ్యస్నానం అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు కెరమేరి మండలంలోని జోడేఘాట్ బయలుదేరి సాయంత్రం ఏడు గంటలకు ఆసిఫాబాద్ కు చేరుకుంటుందని వివరించారు. ఈ ప్రయాణం మొత్తం 170 కిలోమీటర్లు ఉంటుందని, పెద్దలకు రూ. 280, పిల్లలకు రూ.140 లు టిక్కెట్ ధర నిర్ణయించినట్టు తెలిపారు. టికెట్లను బస్సులోనే అందజేస్తారని, ఆసక్తి గలవారు ఈ నెల 27వ తేదీన ఉదయం 7.45 నిమిషాలకు ఆసిఫాబాద్ బస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 6300489162, 9959226006 నెంబర్లను సంప్రదించాలని కోరారు.