నార్నూర్ : కుమ్రం భీం జిల్లా (ఆసిఫాబాద్) కెరమేరి మండలం పరిధిలోని పరందోళి గ్రామంలో బస్సు ప్రమాదం తృటిలో తప్పింది . గురువారం ఉదయం ఆదిలాబాద్ ఆర్టీసీ (RTC) డీపో నుంచి బస్సు బయలుదేరిన బస్సు నార్నూర్ మండలం ఉమ్రి పరందోలి ఘాట్ వద్ద బ్రేకులు ఫేలై పత్తి చేనులోకి ( Cotton field ) దూసుకెళ్లింది.
బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలయినట్లు ప్రయాణికులు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న నార్నూర్ ఇన్చార్జి సీఐ అంజమ్మ ఘటన స్థలానికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటన గురించి ప్రయాణికులు, బస్సు డ్రైవర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.