బజార్హత్నూర్ : మండలంలోని ఆదర్శ పాఠశాలను సందర్శించడానికి వచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి (DEO) శ్రీనివాస్ రెడ్డికి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్( Principal ) రాచ మర్యాదలు చేశారు. బజార్ హత్నూర్ మండలంలోని పిప్పిరి, గిర్నూర్, బజార్ హత్నూర్ ప్రాథమిక పాఠశాల, ఆదర్శ పాఠశాలలను గురువారం డీఈవో, ఎంఈవో సందర్శించారు.
ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు పక్క పప్పు, అన్నంతో భోజనం చేస్తే డీఈవో, ఎంఈవోకు చికెన్ ( Chickens ) తో భోజనం పెట్టి మర్యాదలు చేశారు. విద్యార్థుల భోజనం గురించి ఆరా తీయకుండానే వారు వెళ్లిపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజనం బియ్యంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.