బెల్లంపల్లి : మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధి ఎర్రగుంట చెరువును ( Erragunta tank ) యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్‌కు ( Sai Manoj ) వినతి పత్రం సమర్పించారు. కబ్జాకు గురైన ఎర్రగుంట చెరువుపై సంబంధిత అధికారులచే విచారణ జరిపించాలని కోరారు.
చెరువు కబ్జాకు గురి కావడంతో దానిపై ఆధారపడ్డ మత్స్యకారులు, గీతా కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మణి రామ్ సింగ్, చాంద్ పాషా , రాష్ట్ర నాయకులు గోగర్ల శంకర్ శంకర్, అంబాల మహేందర్ , గోడిసెల లక్ష్మి, దుగుట రాజకుమార్ , రాష్ట్ర కమిటీ సభ్యులు, చొప్పదండి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.