మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 29 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ ఆసుపత్రిలో మూత్రపిండ యాంజియోప్లాస్టీలో చరిత్రాత్మక విజయం సాధించినట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. ప్రముఖ కార్డియాలజిస్ట్ వైద్యులు రాజేశ్ బుర్కోండ ఆధ్వర్యంలోఅధునాతన పద్ధతులతో మూత్రపిండ యాంజియోప్లాస్టీ విధానం ద్వారా ఓ రోగికి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఇలాంటి సర్జరీలు అరుదుగా జరుగుతుంటాయని, నగరాల్లో లభించే ఖరీదైన వైద్య సదుపాయాలు ఇప్పుడు టచ్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. అత్యాధునిక పద్ధతుల్లో ఈ ఆపరేషన్ నిర్వహించామన్నారు. టచ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడం గర్వంగా ఉందన్నారు.
వైద్య చికిత్స అనంతరం రోగిలో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు మాటేటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.