జిల్లా సెక్టోరియల్ అధికారి నర్సయ్య
చదువు.. ఆనందించు.. అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 7: విద్యార్థులు పఠనాసక్తిని పెంపొందించుకోవాలని జిల్లా సెక్టోరియల్ అధికారి కంటె నర్సయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ యూపీఎస్ పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన చదువు.. ఆనందించు.. అభివృద్ధి(రీడ్) కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సెక్టోరియల్ అధికారి మాట్లాడుతూ విద్యార్థులకు చదవడం వస్తేనే సబ్జెక్టుల్లో రాణిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ, సంతోష్ కుమార్, వకీల్ పాల్గొన్నారు.
జైనథ్, ఫిబ్రవరి 7: జైనథ్ మండలంలోని మేడిగూడ రోడ్డులో గల జిల్లా పరిషత్ ఉన్నత , ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన చదువు-ఆనందించు..అభివృద్ధి(రీడ్) కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులచే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యవాన్ చిక్డే మాట్లాడుతూ ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు చదవడ ంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొనగెల నారాయణ, సర్పంచ్ శ్యాంసుందర్, ఉన్నత ప్రాథమిక విద్యా కమిటీ చైర్మన్లు పొలవేణి అడేల్లు, మహేందర్, వీడీసీ చైర్మన్ క్యాతం రాంరెడ్డి, ఉపాధ్యాయులు జ్యోతి, నాందేవ్, దేవీదాస్, తదితరులు పాల్గొన్నారు.