బేల, జూలై 8 : మహిళలు చిరు వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా ఎదుగడమే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని డీఆర్డీఏ పీడీ రవీందర్ రాథోడ్ అన్నారు. బేల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పద్మావతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య రవీందర్ రాథోడ్ హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమాన అవకాశాలు, హక్కులు కల్పించి వారు సాధికారత సాధించేలా తెలంగాణ ప్రభుత్వం మహిళ లోకాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు.
రుణాలు తీసుకోని సక్రమంగా కట్టిన సంఘాలకు జిల్లాకు ఏడు కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా విద్య, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అదేవిధంగా అరవై సంవత్సరాలు దాటినా మహిళలకు కూడా కొత్త గ్రూప్ ని తయారు చేసి రుణాలు ఇస్తామన్నారు. లోన్ తీసుకోని ప్రమాదవశాత్తు మహిళలు మరణిస్తే ప్రమాద బీమా కింద ఇప్పుడు పది లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సుజాత, శ్రీనివాస్, సీసీలు శరత్ రెడ్డి, ప్రమోద్, లక్ష్మి, దేవానంద్, తదితరులు పాల్గొన్నారు.