నార్నూర్: విద్యతోపాటు విద్యార్థులు క్రీడల్లోనూ( Sports ) రాణించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ బలిరామ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాడిహత్నూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థి రాథోడ్ అర్జున్ ( Rathod Arjun )రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ( Athlete) పోటీలకు ఎంపికైన సందర్భంగా మంగళవారం అతడిని సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో రాథోడ్ అర్జున్ రన్నింగ్ లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీ రాథోడ్ రవీందర్, ఉపాధ్యాయులు కవనకోకిల బంకట్ లాల్, సంజీవ్ జాదవ్, కాంబ్లే మిళింద్ తదితరులున్నారు.