కనిపించిన నెలవంక
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. సోమవారం నెలవంక కనిపించగా, మంగళవారం నుంచి ఉపవాసాలు ప్రారంభంకానున్నాయి.
- నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం
- ఉపవాసాలు షురూ
- ముస్తాబైన మసీదులు
దండేపల్లి/చెన్నూర్ టౌన్/వాంకిడి, మార్చి 11: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. సోమవారం నెలవంక కనిపించగా, మంగళవారం నుంచి ఉపవాసాలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్11న శవ్వాల్ నెలవంక కనిపిస్తే రంజాన్ పండుగ జరుపుకుంటారు. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం. ఖురాన్‌లోని 30 అధ్యయాలు ఈ మాసంలోనే పూర్తి చేస్తారు. దీనినే తరావి నమాజ్ అంటారు.
ఉపవాసం ఒక సామాజిక అంశం
ముస్లింలు 30 రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తారు. దైని క పనులు చేస్తూ కఠోర దీక్ష(ఉపవాసం-రోజా)చేస్తూ అల్లాహ్‌ను స్మరిస్తారు. పేదలు పడే ఆకలి బాధ ఎలా ఉం టుందో ఉపవాసాల మూలంగా అనుభవంలో కి వస్తుం ది. రోజా అంటే కేవలం నీరు, ఆహారం తీసుకోవడమే కాదు. అన్ని రకాల చెడు కార్యాలు, అన్యాయం, అధర్మం, కామ కోరికలు మనసులోకి రానివ్వకుండా పాప క్రియల నుంచి దూరంగా ఉంటూ అల్లాహ్ స్మరణ చేస్తూ తనకు తాను అంతర్గతంగా ఆత్మ ప్రక్షాళన చేసుకోవడం.
రంజాన్ దీక్ష ప్రాముఖ్యత-విశేషాలు
రంజాన్ ఉపవాస దీక్షలో సహర్-ఇఫ్తార్ ముఖ్యమైనవి. రంజాన్ నెలలో 30 రోజులు ఉపవాస దీక్షలు పాటించాలి. సూర్యోదయం కంటే ముందే నిర్దేశిత సమయంలో అన్నపానీయాలు తీసుకోవాలి. దీనినే సహర్ అంటారు. ప్రతి రోజూ కొన్ని నిమిషాల తేడాతో సూర్యాస్తమయంలో ఉపవాసదీక్ష విరమించడమే ఇఫ్తార్. దీక్షా సమయంలో ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోరాదు. మందులు, ఇంజక్షన్లు, చివరికి నోటిలో ఊరే లాలాజలం కూడా మింగరాదు. ఇఫ్తార్‌ను ఖర్జూరా, ఇతరత్రా ఫలాలతో విరమిస్తారు.
ఇస్లాం అంటే..
ఇస్లాం అంటే సకల చరాచర సృష్టికర్త, సర్వేశ్వరుడైన అల్లాహ్‌కు లోబడి ఉండడం అని అర్థం. ఇస్లాం పరిపూర్ణంగా అమలు చేసేందుకు ముస్లింలు 5 ముఖ్య అంశాలను పాటించాల్సి ఉంటుంది.1-ఈమాన్, 2-నమాజ్, 3-రోజా(ఉపవాస దీక్ష),4-జకాత్(ధాన ధర్మాలు)5-హజ్‌యాత్ర.
ఉపవాసాలు ఇలా..
రంజాన్ మాసాన్ని మూడు భాగాలుగా వర్గీకరిస్తారు. మొదటి 10 రోజులు దైవ కారుణ్యానికి ప్రతీక. తర్వాత పది రోజులు క్షమాభిక్షకు ప్రతీక. చివరి పది రోజులు నరకం నుంచి విముక్తికి ఉపకరిస్తాయని మహ్మద్ ప్రవక్త అభివర్ణించారు.
హలీం రుచులు సిద్ధం
రంజాన్ మాసంలో లభించే ప్రత్యేక వంటకం హలీం. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కే పరిమితమైన హలీం దశాబ్ద కాలంగా జిల్లాలోని ముఖ్య పట్టణాలకు విస్తరించింది. యేటా మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపెల్లి, మందమర్రి పట్టణాల్లో స్టాళ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ సైతం విక్రయిస్తున్నారు. తరావి నమాజ్ కోసం మసీదుల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. మసీదులను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

