ఇంద్రవెల్లి | రమాబాయి అంబేద్కర్ను మహిళలు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తం(AMC Chairman Mukade) అన్నారు. ఇంద్రవెల్లి (Indravelli) మండలంలోని మిలింద్ నగర్ త్రిరత్న బుద్ధ విహార్ లో మహామాయా ఉపాసిక సంఘం ఆధ్వర్యంలో మాతా రమాబాయి(Ramabai Jayanti ) అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొని బుద్ధుడి విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్ రాజ్ వాగ్మారే, బౌద్ధ ఉపాసకులు ఉత్తమ్ కాంబ్లె, లాహుదాస్ సావంత్, మస్కే రాజ్ వర్ధన్, భీం ఆర్మీ మండల అధ్యక్షులు ఉత్తం సుర్యవంశీ, భీం ఆర్మీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు సందీప్, జితేందర్, శివాజీ, దిలిప్, మాజీ ఎంపీటీసీ ఆశాబాయి, మహామాయా ఉపాసిక సంఘం అధ్యక్షురాలు మాయాబాయి, శిలాబాయి, ప్రభాబాయి, లతాబాయి, మాయావతి, దూర్పతాబాయి, ఉజ్వలబాయ్, ఉషాబాయి, మధుమాల, సంఘామిత్రబాయి, పంచేశిలా, దీపిక ఛాయబాయి, స్వర్ణ, ఇంద్రబాయి పాల్గొన్నారు .