రామకృష్ణాపూర్, ఏప్రిల్ 16: కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి డా. రాజా రమేశ్ పేర్కొన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ పార్టీ శ్రేణులు బుధవారం రామకృష్ణాపూర్లో జోరుగా ప్రచారం నిర్వహించారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్‌లోని 14, 15,17,18,20 వార్డుల్లో వాల్ పోస్టర్లు అంటించారు. వాల్ రైటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్‌గౌడ్, సీనియర్ నాయకుడు రామిడి కుమార్, బడికల సంపత్, అలుగుల సత్తయ్య, మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, అనిల్‌రావు, రేవెల్లి ఓదెలు, పారుపెల్లి తిరుపతి, గడ్డం రాజు, అశనవేని సత్యనారాయణ, చంద్రమౌళి, లక్ష్మారెడ్డి, రంగరాజు, పైతారి ఓదెలు, మేకల రమేశ్, యువ నాయకులు రామిడి లక్ష్మీకాంత్, చంద్రకిరణ్, శివ, మణి, గోనె రాజేజెందర్ పాల్గొన్నారు.
ఉద్యమ స్ఫూర్తిని చాటాలి
మందమర్రి, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వచ్చి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటాలని బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజారమేశ్ పిలుపు నిచ్చారు. బుధవారం మందమర్రి పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో బీఆర్ఎస్ నాయకులతో కలసి రజతోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ కృషితో చెన్నూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, రాజశేఖర్, బండారు సూరిబాబు, ఎండీ అబ్బాస్, బోరిగం వెంకటేశ్, మద్ది శంకర్, ఈశ్వర్, తోట సురేందర్, జక్కుల సమ్మయ్య, భూపెల్లి కనకయ్య, సీపెల్లి రాజలింగు, రాంసాని శేఖర్, ఎండీ ముస్తఫా, అల్లంల ప్రభాకర్, రాయమల్లు, సీపెల్లి సాగర్, మహిళా నాయకులు రమాదేవి, సుగుణ పాల్గొన్నారు.
బెజ్జూర్‌లో వాల్ రైటింగ్
బెజ్జూర్, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు వాల్ రైటింగ్ చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బూస సారయ్య, యూత్ కన్వీనర్ దుర్గం తిరుపతి, నాయకులు షంషొద్దీన్, బాబు, మంజం కేశవ్ పాల్గొన్నారు.