ఎదులాపురం, మే 29 : ప్రజావాణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేప ట్టాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి లో భాగంగా వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ సంబంధ సమస్యలను ధరణి పోర్టల్లో మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజావాణిలో వచ్చే సమస్యలను తక్షణం పరిష్క రించేలా అధికారులు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. భూ సంబం ధ, పింఛన్, ఉపాధి, విద్యా, తదితర సమస్యలపై అర్జీలను దరఖాస్తుదారులు అదనపు కలెక్టర్కు అందజేశారు. ఈ ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్లో..
నిర్మల్ టౌన్, మే 29 : నిర్మల్ కలెక్టర్ కార్యాల యంలో సోమవారం ప్రజా ఫిర్యాదులను నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. మొత్తం 15 దరఖాస్తులు వచ్చి నట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ సుభాష్ చందర్, అధికారులు పాల్గొన్నారు.
ప్రతి అర్జీని పరిశీలిస్తున్నాం..
ఉట్నూర్, మే 29 : ఆదివాసీ గిరిజన ప్రజల నుంచి వస్తున్న అర్జీలను పరిశీలించి పరిష్కరి స్తు న్నామని ఉట్నూర్ ఐటీడీఏ ఏపీవో కనక భీంరావ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించారు. గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీవో సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. ఆదిలాబాద్ మండలం చిచ్దరి ఖానాపూర్కు చెందిన కుమ్ర మోతీరాం స్వయం ఉపాధి కోసం బొలెరో వాహనం మంజూరు చేయాలని, ఉట్నూర్ మండలం శ్యాంనాయక్తండాకు చెందిన సంతోష్ కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. గాదిగూడ మండలం రాంపూర్ గ్రామస్తులు నీటి వసతులు కల్పించాలని, పెంబి మండలం ఇటిక్యాల గ్రామా నికి చెందిన విజయ్ కుమార్ భూమి పట్టా మంజూరు చేయాలని విన్నవించారు. ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్, ఏవో రాంబాబు, జేడీఎం నాగభూషణం, బీఈడీ కళాశాల ప్రిన్సి పాల్ మనోహర్, డీపీవో ప్రవీణ్, ఐటీడీఏ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.