ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామంలో మంగళవారం రాత్రి ఆశ్వయుజ పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. మహిళలు యువతులు పెద్దఎత్తున పాల్గొని డీజే పాటలకు నృత్యాలు చేశారు. చుట్టూ పక్కల గ్రామాల వారు తరలి వచ్చి తిలకించారు. ప్రతి ఏటా ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఇదే విధంగా ఆడి పాడుతూ సంబరంగా పౌర్ణమి వేడుకలు జరుపుకుంటారని గ్రామస్థులు తెలిపారు. కాగా దీపావళి కి ఈ గ్రామంలో బులాయి వేడుకలు జరుగుతాయి . జిల్లాలోనే అత్యంత వైభవంగా బులాయి వేడుకలు జరుపుతారని రాజుర గ్రామానికి పేరుంది.