నీట్ పేపర్ లీకేజీపై నిరసనల వెల్లువ
నీట్ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు మేరకు శుక్రవారం ఆదిలాబాద్లో పలు విద్యాసంస్థల వద్ద ఆందోళనలు జరిగాయి.
- కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
- విద్యాసంస్థల బంద్..విద్యార్థి సంఘాల ఆందోళన
ఎదులాపురం/బోథ్, జూలై 24: నీట్ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు మేరకు శుక్రవారం ఆదిలాబాద్లో పలు విద్యాసంస్థల వద్ద ఆందోళనలు జరిగాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తుగానే సెలవులు ప్రకటించాయి. విద్యానగర్లోని గజిటెడ్ నంబర్-1 పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిను ఖండిస్తూ నినాదాలు చేశారు. పాత బస్టాండ్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. అనంతరం ప్రధాన గేటు ఎదుట ధర్నా చేశారు. ఈ ఆందోళనల్లో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బుట్టి శివకుమార్, డీవైఎఫ్ఐ జిల్లా కో-కన్వీనర్ అన్నమొల్ల కిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఇషాంత్, కపిల్, కేశవ్, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. బోథ్ మండలంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు బంద్లో పాల్గొన్నాయి. నిరసనలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మున్సిఫ్, ప్రేమ్, ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో జరిగిన నిరసనలో..
ఉట్నూర్, జూలై 24: విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడకూడదని ఉట్నూర్ మాజీ జడ్పీటీసీ చారులత అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు చేసిన దాడులను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఎన్టీఏను రద్దు చేయాలి
నిర్మల్ అర్బన్, జూలై 24: నీట్ పరీక్ష నిర్వహణలో విఫలమైన ఎన్టీఏను రద్దు చేయాలని నిర్మల్ జిల్లాలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న 21 కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు షోయబ్ మిర్జా డిమాండ్ చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

