Protest with flexi | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకరా కే గ్రామస్తులు కాంగ్రెస్ మోసాలపై నివేదన రీతిలో బుధవారం నిరసన చేపట్టారు. గ్రామస్తులు తమ ఇంటిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వాటిలో రాసి పెట్టారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు రూ.రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి పథకాలు అమలు కావడం లేదని, యువతులకు స్కూటీలు సైతం పంపిణీ చేయడం లేదని ఫ్లెక్సీల్లో వివరించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.