ఖానాపూర్, జూన్ 4: దేశం, రాష్ట్రంలో రైతాంగం ఎదురొంటున్న సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఖానాపూర్ తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య మాట్లాడుతూ.. రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలన్నారు.
అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్ కార్యాలయంలో నయాబ్ తహసీల్దార్ మంజులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐయూకేఎస్ నాయకులు జకుల రాజన్న, గోరే బాయ్, అడ్లగట్ట శంకర్, గోనే నారాయణ, వర్మ, జైతూ, నర్సింగారావు, లింగాల శంకర్ పాల్గొన్నారు.