ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతానికి చెందిన గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ సంస్థలతోపాటు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఐటీడీఏ జేడీఎం నాగభూషణ్ (ITDA JDM Nagabusan ) వెల్లడించారు. శనివారం ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండలంలోని మహిళా సమైక్య(ఐకేపీ) కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 128 మంది గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారని తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో 91మందిని ఎంపికచేశారని వివరించారు.
జీ4ఎస్, విప్రో సాప్ట్ వేర్ సంస్థలో 24 మంది, కేఎల్ గ్రూప్ సంస్థలో 19 మంది, వివిధ రకాల సంస్థలో 48 మంది ఎంపికయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం మల్లేష్, ఐకేపీ ఏపీఎం రామారావ్, జేఆర్పీ గైక్వాడ్ సంజీవ్ కుమార్, కేఎల్ గ్రూప్ హెచ్ ఆర్ విష్ణు, జీ4ఎస్ సెక్యూరిటీ హెచ్ ఆర్ ప్రభు, ఐకేపీ సీసీ శ్రీరామ్ బామ్నే, తదితరులు పాల్గొన్నారు.