నిర్మల్ చైన్గేట్, సెప్టెంబర్ 14 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో వసతులు లేకపోవడంతో బాలింతలు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య కళాశాల మంజూరైంది. మాతా, శిశు ఆరోగ్య కేంద్రం డీఎంఈ పరిధిలోకి వెళ్లింది. దవాఖానలో మె రుగైన వైద్య సేవలు అందుతుండడంతో రోగు ల సంఖ్య గణనీయంగా పెరిగింది. నిర్మల్ చు ట్టూ పక్కల ఉన్న ప్రాంతాల ప్రజలతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మహారాష్ట్ర నుం చి చికిత్స కోసం వస్తుంటారు. రోజూ ఓపీ సగటున 150కి పైగా ఉంటుంది. హాస్పిటల్లో 50 పడకలకు 87 మంది బాలింతలు, రోగు లు ఉన్నారు. సరైన వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో సగటున రోజూ 12కు పైగా ప్రసవాలు అవుతున్నాయి. గత నెలలో 318 డెలివరీలు అయ్యాయి. ఈ నెలలో ఇప్పటివరకు 140 వరకు జరిగాయి. గురువారం ఒక్కరోజే 16 ఆపరేషన్లు చేశారు. శుక్రవారం 12 అయ్యాయి. బాలింతలకు సరిపడా బెడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు ఇరుకుగా ఉండడంతో బాలింతలు, శిశువులకు చికిత్స అందించడం సమస్యగా మారింది. దీనికితోడు సరిపడా గదులు లేకపోవడంతో వరండాలోనే బెడ్లు వేసి చికిత్స అందిస్తున్నారు. రోగులు, వారి బంధువులు అధిక సంఖ్యలో వస్తుండడంతో దవాఖాన కిటకిటలాడుతున్నది. రోగులకు సేవలందించేందుకు వైద్య సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాలింతలు తెలిపారు.
మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రిలో రెండు ప్రొఫెసర్ పోస్టులకు ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఒక ప్రొఫెసర్ గైర్హాజరుగా ఉన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ రెండు పోస్టులకు ఒకరు గైర్హాజరు ఉన్నారు. అసిస్టెంట్ ఎనిమిది పోస్టులకు ముగ్గురే పని చేస్తున్నారు. ఐదు పో స్టులు ఖాళీగా ఉ న్నాయి. ప్రభు త్వం స్పందించి సిబ్బంది నియామకంతోపాటు సామర్థ్యాన్ని పెం చాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.