బోథ్, డిసెంబర్ 8: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకొవాలని వేడుకుంటూ శుక్రవారం బోథ్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కార్యకర్తలు, నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజలకు మరిన్ని సేవలందించాలని వేడుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం మొదటి సారిగా బోథ్‌కు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.