మంచిర్యాల అర్బన్, ఆగస్టు 10 : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ ఉషోదయ పాఠశాలలో శనివారం క్రికెట్ పోటీలు నిర్వహించారు. నాలుగు టీంలు తలపడగా, పీపీ సురేంద్ర ఉపాధ్యాయ టీం, జ్యుడీషియల్ స్టాఫ్ టీం ఫైనల్‌కు చేరుకున్నాయి. ఫైనల్లో పీపీ సురేంద్ర ఉపాధ్యాయ టీం విజయం సాధించగా, జ్యుడీషియల్ స్టాఫ్ టీం రన్నర్‌గా నిలిచింది.
అద్భుతమైన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా రవితేజ నిలిచారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కట్కూరి గంగయ్య, జనరల్ సెక్రటరీ మురళీకృష్ణ, స్పోర్ట్స్ సెక్రటరీ సంతోష్, సీనియర్ న్యాయవాదులు వడ్నాల సత్యనారయణ, ఎం.రవీందర్, రంగు మల్లేశ్, మదన్మోహన్, అరుమంద రవి, ప్రకాశ్ పాల్గొన్నారు.