తాండూర్ : గ్రామపంచాయతీ ఎన్నికలు ( Panchayat Election ) శాంతియుతంగా జరగడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తాండూర్ సీఐ దేవయ్య ( CI Devaiah ) , ఎస్సై డీ కిరణ్కుమార్ ( SI Kiran Kumar ) వెల్లడించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాండూర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతియుత ,స్వేచ్ఛా ,నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
అనుమతి లేకుండా ప్రజలు గుమిగూడి ఉండటం, ర్యాలీలు, నిర్వహించడం నిషేధమని వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన జరిగితే వెంటనే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రచార సమయం గడిచిన తరువాత లౌడ్ స్పీకర్లు, ప్రచారం నిషేదమని అన్నారు. ఓటర్లపై బెదిరింపులు, ప్రలోభాలు, ఒత్తిళ్లు ఏవైనా ఉంటే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.
సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం, పుకార్లు, రెచ్చగొట్టే సందేశాలు పంపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివాదాలు సృష్టించే, ఉద్రిక్తత పెంచే, తప్పుడు ప్రచారానికి దారితీసే లేదా చట్టవిరుద్ధమైన పోస్టులను అనుమతించ వద్దని తెలిపారు.