హాజీపూర్/మంచిర్యాల ఏసీసీ, జూన్ 3 : ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హాజీపూర్ మం డలం ముల్కల్ల ఐజా కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రా న్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అందరూ సహకరించాలన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద ఐదుగురు ఏసీపీలు, 14 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, 112 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 96 మంది కానిస్టేబుళ్లు, 21 మంది ఉమెన్ హెడ్ కానిస్టేబు ళ్లు, 21 ఉమెన్ కానిస్టేబుళ్లు, 80 మంది హోంగార్డులు, 3 స్పెషల్ పార్టీలు, కేంద్ర బలగాల సిబ్బంది డ్యూటీలో ఉంటారని తెలిపారు.
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు 144 సెక్ష న్ అమలులో ఉంటుందన్నారు. ఐదుగురికంటే ఎకువ మంది గుమికూడరాదని, పటాకులు కాల్చరాదని తెలిపారు. రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు ఉన్న వారినే భద్రతా సిబ్బంది కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తుందన్నారు. విజయోత్సవ ర్యాలీల కోసం సంబంధిత పోలీస్ అధికారుల నుంచి రాత పూర్వకంగా అనుమతి పొందాల్సి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్, మంచిర్యాల ఏసీపీ రత్నప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐలు ఆకుల అశోక్, లక్షెట్టిపేట సీఐ అల్ంల నరేందర్, మంచిర్యాల ట్రాఫిక్ సీఐ నరేశ్ తదితరులున్నారు.