నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 18 : జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు పకడ్బందీ చ ర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులతో పాటు పాత నేరస్తులు, గతంలో వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని ఆరా తీస్తూ ప్రస్తుతం వారి కదలికలు ఎలా ఉన్నాయి. మళ్లీ నే రాలకు పాల్పడుతున్నారా..? ఏం పనులు చేస్తున్నారు..? అని ఆరా తీస్తున్నారు. నేరాలకు పాల్పడవద్దని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని నేరస్తులకు సూచిస్తున్నారు. అంతేగాకుండా పాలిపాల్ ఫ్రింగర్ ప్రింట్స్‌తో జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. దీంతో గతంలో నేరాలు చేసిన వారు అప్రమత్తం అవుతుండడంతో పాటు నేరాలకు పాల్పడాలనే వారి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కొత్త తరహా నేరాలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నా రు. దీంతో జిల్లాలో నేరాల శాతం తగ్గడమే కా కుండా నిందితులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా వారిపై నిఘా పెడుతున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల నియత్రణకు, నేర పరిశోధనకు అధునాతన సాంకేతిక పరిజ్ఞాన్ని పోలీసులు అవలంభిస్తున్నారు. దీంతో ఒక్క వేలి ముద్రతో నేరస్తుల చిట్టా బయటపడుతోంది. రాష్ట్రంలో (ఎస్ఈఆర్బీ) స్టేట్ క్రైమ్ రి కార్డ్ బ్యూరోలో నమోదైన నేరస్తుల జాబితాను ఫింగర్ ప్రింట్ పరికరంలో నిక్షిప్తం అయ్యి ఉం టుంది. పూర్తి వివరాలను వారి ఆధార్ కార్డు, వేలిముద్రలతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఒక్కసారి పోలీస్‌స్టేషన్‌లో నిందితులుగా పేరు నమోదు అయితే వారి సమాచారం మొత్తం పేరు, వయస్సు, నివాసం, ఏ పోలీస్ స్టేషన్లో కేసు న మోదైంది. ఏ విషయంలో కేసు నమోదైందో ఇలా పూర్తి వివరాలు పాపిలాన్ ఫింగర్ పరికరంలో నిక్షి ప్తం అయ్యి ఉంటుంది. పోలీసులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల ఫింగర్ ప్రింట్‌ను పరికరంపై ఉంచితే గతంలో నేరస్తుడా..?.. కాదా..? అనే విషయం నిర్ధారణ అవుతున్నది.
జిల్లాలో మొత్తం 36 పాపిలాన్ ఫింగర్ ప్రింట్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వా రా పోలీసులు ప్రతిరోజూ సగటున జిల్లావ్యాప్తం గా 1000-1500 వరకు అనుమానాస్పద వ్యక్తు ల వేలి ముద్రలను సేకరిస్తున్నారు. మార్కెట్లు, షా పింగ్ మాల్స్, థియేటర్లతో పాటు సభలు, సమావేశాల్లో వీటిని వినియోగిస్తున్నారు. అంతేగాకుండా రాత్రి వేళల్లో ప్రజలకు మెరుగైన భద్రతను అందించేందుకు అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులు కనబడితే వారిని సులువుగా గుర్తు పట్టి దొంగతనాలు, ఇతర ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తం అవుతున్నారు.
జిల్లాలోని 19 మండలాల పరిధిలోని అన్ని పో లీస్ స్టేషన్లలో గతేడాది 4,4524 మంది అనుమానాస్పద వ్యక్తుల వేలి ముద్రలను పోలీసులు తని ఖీ చేయగా, 249 పాత నేరస్తులు పట్టుబడ్డారు. వీరిని విచారించి ఎందుకోసం వచ్చారు..? ప్రస్తు తం ఏ పనులు చేస్తున్నారు..? అని ఆ రా తీశారు. అంతేగాకుండా ఎలాంటి నేరాలకు పా ల్పడకుండాఉండాలని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి స త్ప్రవర్తనతో మెలగాలని పోలీసులు సూచిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో నేరాల ను పూర్తిగా తగ్గించి మె రుగైన శాంతి భద్రతల రక్షణకు కృషి చేస్తు న్నాం. ఇందులో భాగం గా అనుమానాస్పద వ్య క్తులు కనబడితే వెంటనే విచారించకుండా ఫింగర్ ప్రింట్ ద్వా రా వారి నేర చరిత్రను తెలుసుకొని విచారిస్తున్నాం. ఇ లాంటి తనిఖీలతో నేరస్తులకు భయంతో పా టు, నేరాలు చేయాలనే ఆలోచన ఉన్నవారిలో కూడా ఆందోళన మొదలై నేరాలు తగ్గే ఆస్కా రం ఉంటుంది. అంతేగాకుండ ప్రజలకు పోలీసులపై పూర్తి న మ్మకం కలుగుతుం ది. ప్ర జ లు కూడా పోలీసులకు పూర్తి సహకారం అం దించి నేరాల నియంత్రణకు సహకరించాలి.
-సీహెచ్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ, నిర్మల్