తాండూర్ : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పోచమ్మ, పెద్దమ్మతల్లి బోనాలు (Pochamma Bonalu ) ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఉపవాసాలతో బోనాలు వండి పోచమ్మ, పెద్దమ్మతల్లి ఆలయాల్లో బోనాలతో నైవేద్యాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి అధిక దిగుబడులు రావాలని, తమ కుటుంబాలు చల్లగా ఉండాలని గ్రామ దేవతలైన పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ దేవతలకు పూజలు నిర్వహించారు. కోల్ బెల్ట్ ప్రాంతమైన తాండూర్ ఏరియాలో ప్రతి కాలనీ వాసులు, వాహనదారులు, ట్రాలీల యజమానులు, ఆటో డ్రైవర్లు తమ యూనియన్ల ఆధ్వర్యంలో, సింగరేణి కార్మికులు సామూహికంగా సైడ్ పిల్లల పూజలు నిర్వహించారు.