తాండూర్ : యోగా సాధనతో అనేక శారీరక రుగ్మతలు దూరం అవుతాయని , మానసిక ప్రశాంతత చేకూరుతుందని సీఐ కుమార స్వామి ( CI Kumarswamy ) అన్నారు. నిత్యం యోగా సాధన చేయాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day ) సందర్భంగా శనివారం తాండూర్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
విద్యార్థులకు, యువకులకు చదువుతో పాటు క్రీడలు, యోగా వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్, మాదారం, భీమిని ఎస్సైలు కిరణ్ కుమార్, సౌజన్య, విజయ్ కుమార్ పాల్గొన్నారు. తాండూర్ మండల వాకర్స్ క్లబ్ సభ్యులతో కలిసి సామూహిక యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించి మాదకద్రవ్యాల నిరోధ వారోత్సవాన్ని నిర్వహించారు.
తంగళ్లపల్లి హైస్కూల్, రేచిని పాఠశాలల, తాండూర్ పీహెచ్సీ ఆయష్ దవాఖాన, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఎస్ మల్లేశం, పీహెచ్సీ డాక్టర్ ఝాన్సీ, ఆయుష్ డాక్టర్ శ్రుతి, అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు, యోగా సాధకులు, తదితరులు పాల్గొన్నారు.