ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ ఆంధ్ గూడ గ్రామంలోని ఫూలాజీబాబా (Phulajibaba) ధ్యానకేంద్రం వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తం ( Mukhade Uttam) ముఖ్య అతిథిగా పాల్గొని ఫూలాజీబాబా ధ్యానకేంద్రం జెండాకు పూజలు నిర్వహించి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజులుగా కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుడే కైలాస్, గ్రామస్థులు శ్రీరాం, భరత్, ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు.