ఉమ్మడి జిల్లా చరిత్రలోనే భారీ రిక్రూట్మెంట్
రెండు జోన్ల పరిధిలోకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా..
నూతన జోనల్‌తో 95 శాతం స్థానికులకే నౌకర్లు
కేంద్రం నిర్లక్ష్యం వల్లే ఇన్నాళ్లు ఆలస్యం
అభ్యర్థుల వయోపరిమితి పదేళ్లు పెంపు..
800 మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్
అంబరాన్నంటిన ఉద్యోగ అభ్యర్థుల సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
ముఖ్యమంత్రికి సబ్బండవర్గాల కృతజ్ఞతలు
ఆదిలాబాద్, మార్చి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొలువుల జాతరకు తెలంగాణ సర్కారు తెరలేపింది. వేలాది మంది ఉద్యోగ అభ్యర్థులకు తీపికబురు అందించింది. రికార్డుస్థాయి రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో ఎప్పుడూలేని విధంగా నేరుగా పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇదే సమయంలో సమైక్య రాష్ట్రంలో సవాలక్ష లొసుగులతో ఉన్న పాత జోనల్ విధానానికి ప్రభుత్వం పాతరేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు రూపు దిద్దుకున్న.. కొత్త జోనల్ వ్యవస్థ తాజాగా జరిగే నియామకాలకు వేదిక కానుంది. ఫలితంగా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. నియామక ప్రక్రియలో నూతన ఒరవడి అమల్లోకి రానుండగా.. వివిధ క్యాడర్ పోస్టుల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. రెండు జోన్ల పరిధిలోకి వచ్చే ఉమ్మడి జిల్లా ఉద్యోగ అభ్యర్థులు గ్రూప్ పోస్టులు కాకుండా లోకల్, జోనల్, మల్టీజోనల్ పరిధిలో నేరుగా నియామకం చేసే పోస్టులకు పోటీపడే అవకాశం ఏర్పడింది. సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా బుధవారం చేసిన ప్రకటన ఫలితంగా ఉమ్మడి జిల్లాలో ఎనిమిది వందల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రకటనతో సంబురాలు అంబరాన్న ంటాయి. ఉద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పటాకులు కాల్చుతూ, మిఠాయిలు తినిపించుకుంటూ సంబురాలు చేసుకు న్నారు.
ఉమ్మడి జిల్లాలో 3,919 లోకల్ క్యాడర్ పోస్టులు
నీళ్లు, నిధు లు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పటికే నీళ్లు పరవళ్లు తొక్కుతుండగా.. ప్రభుత్వం బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయిస్తున్నది. ఉద్యోగ అభ్యర్థులకు భారీ సంఖ్యలో నౌకర్ల నోటిఫికేషన్లు వేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలనే ఉద్దేశంతో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ విధానాలు అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి ఆమో దం తెలుపడంతో స్థానిక క్యాడర్ వ్యవస్థీకరణ ప్రక్రియ గతేడాది ఆగస్టులో పూర్తయింది. ఇటీవల జిల్లా, జోనల్ స్థాయిలో స్థానిక జాబర్స్‌కు బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. స్థానిక క్యాడర్లలో ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలపై కూడా స్పష్టత ఇచ్చింది. జోనల్ వ్యవస్థ అమలుపై ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వ వైఖరితో నోటిఫికేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. బదిలీల అనంతరం ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి.. వీటి ఆధారంగా భారీ నజరానా ప్రకటించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,919 పోస్టులు
రాష్ట్ర వ్యాప్తంగా 80,039 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3,919 ఉద్యోగాలు లభించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా లో 1,193, నిర్మల్‌లో 876, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 825, మంచిర్యాలలో 1,025 పోస్టులు భర్తీ కానున్నాయి. బాసర జోన్ పరిధిలోకి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు రానుండగా.. 2,328.. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కాళేశ్వరం జోన్ పరిధిలోకి రానుండగా.. 1,630, నాలుగు జిల్లాల పరిధిలో ఉండే మల్టీజోనల్-1లో 6,800 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1,33,942 ఉద్యోగాలను భర్తీ చేయగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలువురు ఉద్యోగాలు సాధించారు. సీఎం ప్రకటనతో కొత్తగా మరో 4 వేల మందికి సర్కారు కొలువులు లభించనున్నాయి. భారీ ఉద్యోగాల ప్రకటనపై జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ అభ్యర్థులు వారి తల్లిదండ్రులు, టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
స్థానికులకే 95 శాతం రిజర్వేషన్
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అన్ని క్యాడర్ ఉద్యోగాలలో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా పెరుగనున్నాయి. గతంలో ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వంటి ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. ఇప్పడు స్థానికులకు ఉద్యోగాలు లభించనున్నాయి. జిల్లాలవారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుండడంతో వివిధ శాఖల్లోని ఖాళీలు కూడా భర్తీ కానున్నాయి. ఫలితంగా పల్లె, పట్టణాల్లో సమస్యలు పరిష్కారమై సుపరిపాలన అందే అవకాశం ఉంది.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
ఉమ్మడి రాష్ట్రం నుంచి వివిధ శాఖల్లో చాలా మంది కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారు. ఏండ్ల నుంచి పనిచేస్తున్న వారికి ప్రయోజనం చేకూరేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2014 జూన్ 2 నాటికి వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 800 మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యూలర్ కానున్నారు. తమను సీఎం కేసీఆర్ గుర్తించి పర్మినెంట్ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వయో పరిమితి పదేండ్లు పెంపు
కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ప్రభుత్వం వయస్సు అర్హతను పదేళ్లు పెంచింది. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులకు మి నహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో వయస్సు పెంపు వర్తించనుంది. ఓసీలకు 44 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్
నా పేరు పబ్బ ఉమాదేవి. నాది మంచి ర్యాల జిల్లా. ఆదిలాబాద్ ప్రభుత్వ బాలికల కళాశాలలో 16 ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న. నా భర్త ప్రైవేటు ఉద్యోగి. పిల్లలు చదువుతున్నరు. వచ్చే కొద్ది జీతంతో బతకడం ఇబ్బందిగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ కాలంలో ఒకసారి కేసీఆర్ సార్ మంచిర్యాల వచ్చిన్రు. అప్పుడు మా రెగ్యులరైజేషన్ గురించి విన్నవించినం. ఆ రోజు ఇంకా నాకు మతికున్నది. కేసీఆర్ సార్ నా తలపై చేయి ఉంచి..అభయమిచ్చిన్రు. అమ్మా తెలంగాణ వచ్చినా క మీరనుకున్నది జరిగి తీరుతది అని మాట ఇచ్చిన్రు. ఇదిగో ఆ రోజు రానే వచ్చింది. 16 ఏళ్ల సుదీర్ఘ కల సాకార మైంది. తండ్రి లాంటి కేసీఆర్ సారుకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్న.
“తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. మన నిధులు మనకే దక్కుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకోవడంతో జలాశ యాలు జలసిరులను తలపిస్తున్నాయి. నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం కోసం పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం.