ఇధనాల్ రగడ
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్‌కు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గురువారం దుకాణాలను బంద్ చేశారు. ఎటువంటి ఘటనలు జరుగలేదు.
- ఎన్‌హెచ్-61 పక్కన టెంట్ వేసుకొని దీక్ష
- నాలుగు గ్రామాల నుంచి తరలివచ్చిన 2 వేల మంది
- వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు..
- దాదాపు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు
- స్వచ్ఛందంగా బంద్ పాటించిన దుకాణాదారులు
- కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- రిలే నిరాహార దీక్షలకు సిద్ధమవుతున్న ప్రజలు, అన్నదాతలు
- ప్రతి గ్రామం నుంచి పది కుటుంబాలు నిత్యం పాల్గొనేలా కార్యాచరణ
దిలావర్పూర్, జనవరి 4 ః నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్‌కు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గురువారం దుకాణాలను బంద్ చేశారు. ఎటువంటి ఘటనలు జరుగలేదు. ఉదయం 9 గంటలకే గుండంపల్లి, దిలావర్పూర్, న్యూ లోలం గ్రామాలకు చెందిన దాదాపు 2 వేల మంది రైతులు, ప్రజలు జాతీయ రహదారి-61పైకి తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు ఎన్‌హెచ్ పక్కనే టెంటు వేసుకుని కూర్చున్నారు. పోలీసుల అనుమతితో వంటావార్పు చేసుకున్నారు. రహదారి పక్కనే కూర్చొని సహపంక్తి భోజనాలు చేశారు. ఆందోళన సమాచారాన్ని తెలుసుకున్న పో లీసులు అక్కడకు చేరుకున్నారు. దాదాపుగా 200 మంది బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం రైతులు, ప్రజలు ఇండ్లళ్లకు వెళ్లిపోయారు.
రిలే నిరహార దీక్షలకు సిద్ధమవుతున్న రైతులు
నేటి(శుక్రవారం) నుంచి పరిశ్రమ రద్దు చేసే వ రకు జాతీయ రహదారి-61 పక్కన శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేసేందుకు రైతులు కార్యాచరణ చేశారు. ప్రతి గ్రామం నుంచి 10 కు టుంబాలు నిత్యం రిలే నిరాహార దీక్షలో పాల్గొనే లా కార్యాచరణ రూపొందించారు. కాగా, మా ప్రాణాలు తీసే ఇథనాల్ పరిశ్రమ మా గ్రామంలో వద్దని కోరుతూ ఐదేండ్ల చిన్నారి తన కుటుంబ స భ్యులతో కలిసి వచ్చింది. జాతీయ రహదారిపై కూర్చొని భోజనం చేసి నిరసన తెలిపింది. అనంతరం రైతులు మాట్లాడుతూ తమ పొట్టగొట్టే పరిశ్రమను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపా రు. స్థానిక ఎమ్మెల్యేతోపాటు మాజీ మంత్రి తమ ఉద్యమానికి సంఘీభావం తెలపాలని కోరారు.
60 మందిపై కేసు..
దిలావర్పూర్, జనవరి 4 ః నిర్మల్ జిల్లా దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ స్థలాన్ని బుధవారం ముట్టడించి.. గోడలు కూల్చివేసి, ఫర్నీచర్ ధ్వం సం చేసి, వాహనాలకు నిప్పు పెట్టిన పలువురు రైతులు, యువకులపై కేసులు నమోదు చేసినట్లు దిలావర్పూర్ ఎస్ఐ యాసీర్ ఆరఫత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. కంపెనీ ఉద్యోగులు కే సందీప్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 60 మంది రైతులు, యువకులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా పరిశ్రమ వద్ద విధులు నిర్వహించడానికి వచ్చిన లోకేశ్వరం మండలానికి చెందిన ఇంటెలీజెన్స్(ఎస్బీ) హెడ్‌కానిస్టేబుల్ లక్కపెల్లి జీవన్‌రావు, భైంసాకు(ఎస్బీ) కానిస్టేబుల్ జే శంకర్రావు సెల్ ఫోన్లు తీసుకుని ధ్వంసం చేసిన ఘటనలో ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురు యువకులపై కూడా వివిధ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులోనే కొందరిపై నాన్‌బెయిలబుల్ కేసులు కూడా పెట్టినట్లు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

