జన్నారం, నవంబర్ 26 : 50 ఏళ్లు నిండిన రైతు కూలీలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని రైతు సం క్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్డు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ డిమాండ్ చేశారు. మంగళవా రం రేండ్లగూడ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. స్వామిరంగనాథన్ కమిషన్ సిఫారసు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటలకు మద్దతు ధర కల్పించాలన్నారు. వచ్చేనెల ఒకటిన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని నిర్వహించే వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఏనుగు శుభాష్రెడ్డి, అల్లం లచ్చన్న, అల్లం నరేశ్ పాల్గొన్నారు.