ఇంద్రవెల్లి : బుద్ధుడి బోధనలు సమాజంలో ఉన్నతమైనవని బౌద్దభిక్షువులు (Buddhist monks ) పూజ్య భంతే జీవక్, కమల్ ధమ్మ అన్నారు. మండలంలోని మిలింద్ నగర్ త్రిరత్న బుద్ధ విహార్లో ఆషాడ పౌర్ణమి సందర్భంగా వర్షవాస్ దివస్ను వైభవంగా నిర్వహించారు. బుద్ధుడి ప్రవచనాలతోపాటు బుద్ధ , ధమ్మంపై గ్రంథ పఠనము, ప్రవచనాలు వినిపించారు.
ప్రవచనాలు మూడు నెలల వరకు కొనసాగుతాయని వెల్లడించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బుద్ధుడి మార్గంలో నడువాలని సూచించారు. బుద్ధుడి ప్రవచనాలతో శాంతి సందేశాలు లభిస్తాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బుద్ధడి బోధనాలను పాటిస్తున్నారని తెలిపారు. మంచి మార్గాలపై సమాజం నడిస్తే అన్ని రకాల శాంతియుత వాతావరణం ఉంటుందని తెలిపారు. బౌద్ద ఉపాసకులు. ఉపాసకిలు తదితరులు పాల్గొన్నారు.