ఆదిలాబాద్ : పోలీసు సిబ్బంది మధ్య సత్సంబంధాలు మెరుగుపరచడానికి ప్రతి శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పరేడ్ (Parade) నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) వెల్లడించారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. 9 ప్లాటూన్లులతో కూడిన పరేడ్ విడతలవారీగా జిల్లా ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పరేడ్ వల్ల మానసిక ఉల్లాసం, ఆరోగ్యం మెరుగుపడుతాయని, పోలీసు సిబ్బంది మధ్య ఒకరి పట్ల ఒకరికి గౌరవం, సత్సంబంధాలు పెరుగుతాయని అన్నారు. పరేడ్‌తో సిబ్బందిలో క్రమశిక్షణ (Weekly Off) పెరుగుతుందని వివరించారు. సిబ్బంది కి ఎలాంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని, దానిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని వెల్లడించారు.
సిబ్బంది ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్ల వారిగా వారాంతపు సెలవును అమలు చేయాలని సూచించారు. సిబ్బంది అనవసరంగా విధులకు గైర్హాజరు కాకుండా ఉండాలని సూచించారు. క్రమశిక్షణ తప్పిన ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, సీహెచ్ నాగేందర్, ఇన్స్పెక్టర్లు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు , రిజర్వ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.