హాజీపూర్ : ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం లంచం (Bribe ) తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ ఏసీబీ అధికారులకు (ACB Raid ) రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డాడు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామపంచాయతీ సెక్రటరీ ( Secretary ) పక్కల వెంకటస్వామి ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత బిల్లు కోసం ఆన్లైన్లో ఫోటోలు నమోదు చేసేందుకు లబ్ధిదారుడి వద్ద రూ. 30 వేల డిమాండ్ చేసి బుధవారం రూ. 20వేలు తీసుకున్నాడు. అక్కడే మాటువేసిన కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ, ఆదిలాబాద్ ఇన్చార్జి డీఎస్పీ పి విజయ్ కుమార్ పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకటస్వామిని గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకు వచ్చి విచారణ జరిపి అరెస్టు చేసి కరీంనగర్ తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. గురువారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. డీఎస్పీ వెంట ఇన్స్పెక్టర్లు కిరణ్, తిరుపతి , పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు.