బేల : ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలోని నడుచుకొని ప్రశాంత జీవితాన్ని గడపాలని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రౌత్ మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా చప్రాల (Chaprala) , శంషాబాద్ (Shamsabad) గ్రామాల్లో వారం రోజుల నుంచి నిర్వహించిన సప్తహ వేడుకలు (Saptaha Celebration ) భక్తిశ్రద్ధలతో ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లకి ఊరేగింపునకు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
రౌత్ మనోహర్ మాట్లాడుతూ సప్తహ కార్యక్రమాల వల్ల గ్రామ స్వచ్ఛతతో పాటు, చెడు వ్యసనాల నుంచి విముక్తి లభిస్తుందని, దీని వల్ల ఆధ్యాత్మిక వాతావరణం లభిస్తుందని అన్నారు. ఉదయం ప్రభాత ఫెరి, ధ్యాన, ప్రవచన, హరి పాట్, జ్ఞానేశ్వరి పారాయణ, కీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వర్, నివృత్తి, ముక్తాబాయి, సోపాన్ లా దేవత మూర్తులలో ఉన్న చిన్నారులను గ్రామంలో ఊరేగించారు.
ఈ సందర్భంగా భజన బృందాలు శోభాయాత్ర లో పాల్గొన్నాయి. అనంతరం దహి హండి కాళ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్, రామారావ్, పురుషోత్తం , సతీష్, శాలిక్ రావ్, వెంకటి, హేమంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.