తాండూర్ : తాండూర్ మండలం బోయపల్లి బోర్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road Accident) ఒకరు మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై డీ కిరణ్ కుమార్( SI Kirankumar ) తెలిపారు. అయిలి మల్లేష్ (36) అనే వ్యక్తి రాత్రి తాండూర్ మండలంలోని పంజాబీ దాబా నుంచి బిర్యానీ తీసుకొని మోటార్ సైకిల్‌పై బోయపల్లి బోర్డు వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి స్వస్థలం ఓదెల కాగా ఉపాధి కోసం కాసిపేట గ్రామంలో ఉంటూ కళ్లు గీస్తూ భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. మృతుడు మల్లేష్ కు భార్య రాధిక, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.