కుభీర్, సెప్టెంబర్ 02 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి అదే గ్రామానికి చెందిన తహసీల్దార్ పి రమణ మంగళవారం300 స్టీల్ ప్లేట్లు ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. తన అమ్మమ్మ కీ. శే.కండెల బుచ్చక్క స్మారకార్థం ఆలయంలో ప్లాస్టిక్ ప్లేట్లను పూర్తిగా నిషేధించాలన్న సంకల్పంతో ఆయన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఈ ప్లేట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. ఇదిలా ఉండగా కుభీర్ కు చెందిన పుప్పాల సుభాష్ మరో 200 స్టీల్ ప్లేట్లు అందజేశారు. మొత్తం 500 స్టీల్ ప్లేట్ల విలువ సుమారు రూ. 25 వేలు ఉంటుందని తెలిపారు. దీంతోపాటు వినాయక నిమజ్జనం రోజైన శనివారం రోజు అన్నదానం కోసం అయ్యే ఖర్చులు ఉప్పల సుభాష్ భరిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బల్ల రాములు, ఇజాప్ అనిల్, పి శ్రీనివాస్, సభ్యులు ఉన్నారు.