నిర్మల్ అర్బన్ : నూతనంగా నియమితులైన పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల నూతనంగా నిర్మల్ పట్టణ అధ్యక్షునిగా రెండోసారి నియమితులైన మారుగొండ రాముతో కలిసి పలువురు పార్టీ నాయకులు బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీలో కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్లు లక్కాకుల నరహరి, నాయకులు ధర్మాజీ శ్రీనివాస్, పోశెట్టి, రామకృష్ణ, పద్మాకర్, గండ్రత్ రమేష్ ,మంగార్లరపు పోశెట్టి తదితరులున్నారు.