సోన్, మే 29 : ఏకరూప దుస్తుల తయారీని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశీష్సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని మంజులాపూర్లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తుల తయారు చేస్తున్న టైలరింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియ అత్యంత నాణ్యతగా చేయాలని ఆదేశించారు.
విద్యార్థుల నుంచి తీసుకున్న కొలతల ప్రకారమే దుస్తులను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం సిద్ధాపూర్ ప్రభుత్వ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. పెండింగ్ పనులు జూన్ 5వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. సోన్ మండలంలోని న్యూవెల్మల్లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ సుభాష్, పంచాయతీ రాజ్ ఈఈ శంకరయ్య పాల్గొన్నారు.