హాజీపూర్/మంచిర్యాల ఏసీసీ/దండేపల్లి/ బెల్లంపల్లి/తాండూర్/కోటపల్లి/చెన్నూర్ టౌన్/ చెన్నూర్ రూరల్/శ్రీరాంపూర్/సీసీసీ నస్పూర్, జనవరి 1 : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి, సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. కేక్‌లు కట్ చేశారు. యువకులు నృత్యాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. మహిళలు, చిన్నారులు ఉదయం ఇండ్ల ముందు వాకిళ్లలో ముగ్గులు వేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకరికొక్కరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
నస్పూర్‌లోని కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్‌ను మండల పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అ ధ్యక్షుడు గడియారం శ్రీహరి, అసోషియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ప్రధాన కార్యదర్శి భూముల రామ్మోహన్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ కలిశారు. పుష్పగు చ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జడ్పీ డిప్యూటీ సీఈవో, హాజీపూర్ ఎంపీడీవో అబ్దుల్ హై, దండేపల్లి ఎంపీడీవో మల్లేశ్, మండల పంచాయతీ అధికారులు సఫ్దర్ అలీ తదితరులున్నారు. అలాగే టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఇక్కడ కేం ద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, సం యుక్త కార్యదర్శి సునీత, ఉపాధ్యక్షులు కెజియారాణి, సతీశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్, ప్ర భు తదితరులున్నారు.
గుడిపేటలోని ప్రత్యేక 13వ తెలంగాణ పోలీస్ బెటాలియన్‌లో కమాండెంట్ జమీల్ బాషా, అడిషనల్ కమాండెంట్ ర ఘునాథ్ చౌహాన్, శరత్ కుమార్, యూనిట్ డాక్టర్ శ్రీధర్ కేక్ కట్ చేశారు. ఎస్ఐలు, ఏఆర్ ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకు పలువురు ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

దండేపల్లి మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివా స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి దాసరి తిరుపతిగౌడ్, నాయకులు రాజనాల రమేశ్, కొట్టే రమేశ్, గని అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. తాండూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడనా సంబురాలు జరిగాయి.
బెల్లంపల్లి ఏరియా గనులతో పాటు అబ్బాపూర్ ఓసీపీ-2 పరిధిలో, ఏరియా స్టోర్స్, వర్క్‌షాప్‌లో సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికుల ఆధ్వర్యంలో కేక్‌లు కట్ చేశారు. సీఐ కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాం డూర్, మాదారం ఎస్ఐలు రాజశేఖర్, అశోక్, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, మోడల్ స్కూ ల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. చె న్నూర్ మండలంలోని కిష్టంపేట, ఆస్నాద్, నాగాపూర్, సోమన్‌పల్లి, కొమ్మెర, పొక్కూర్, బీరెల్లి, అక్కెపల్లి, ఓత్కులపల్లి, గంగారం, ముత్తరావుపల్లి గ్రామాల్లో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సీఐ వాసుదేవరావు పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని జీఎం కార్యాలయంతోపాటు శ్రీరాంపూర్ ఓసీపీ, ఆర్కే-8 డిస్పెన్సరీల్లో జీఎం సంజీవరెడ్డి కేక్‌లు కట్ చేశారు.
జీఎం కార్యాలయంలో లక్కీడ్రాలో గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఎస్వోటూ జీఎం రఘుకుమార్, ఫైనాన్స్ ఏజీఎం మురళీధర్, ఓసీపీ పీవో పురుషోత్తంరెడ్డి, డీజీఎం పర్సనల్ అరవిందరావు, సివిల్ డీజీఎం ఆనంద్‌కుమార్, ఐఈడీ డీజీఎం చిరంజీవులు, ఏరియా రక్షణ అధికారి శ్రీధర్‌రావు, డీవైసీఎంవో రమేశ్‌బాబు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డిని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామ య్య, నాయకులు వీరభద్రయ్య, ముస్కె సమ్మ య్య, షేక్ బాజీసైదా, కొట్టె కిషన్‌రావు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. లైజన్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, ఐఈడీ డీజీఎం చిరంజీవులు, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు నీలబోయిన కుమార్, సదిరం రా జేంద్రప్రసాద్, బాపయ్య, నవీన్, మల్లేశ్, ఐఎన్టీయూసీ నాయకులు నీలం సదయ్య, వెంగల కుమారస్వామి, లిల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.